ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం గొల్లప్రోలు వెటర్నరీ హాస్పిటల్లో ఉచిత యాంటీ రేబిస్ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పీబీసీ ఛైర్మన్ సునీల్ కుమార్, జనసేన పార్టీ నాయకులు, పశువైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కుక్కలకు రేబిస్ వ్యాధి సోకకుండా టీకాలు వేశారు. ప్రతి ఏడాది ఈ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.