గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామ శివారులో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 9 మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 104 పేక ముక్కలను, 10850 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామని, జూద క్రీడల జోలికిపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు.