చెందుర్తిలో అగ్నిప్రమాదం

56చూసినవారు
గొల్లప్రోలు మండలం చెందుర్తి ఎస్సీ పేటలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైంది. అయినవిల్లి నానికి చెందిన తాటాకిల్లు కాలిపోవడంతో ఆ కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటిలోని ఫ్రిజ్, బీరువా, టీవీ, గృహోపకరణాలు, దుస్తులు, నిత్యావసరాలు కాలిబూడిదయ్యాయి. పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

సంబంధిత పోస్ట్