గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని గల పవన్ కళ్యాణ్ నివాసం వెనక ఉన్న అడవి పుంత రోడ్డు నందు శుక్రవారం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రస్థాయి గుర్రపు పందాల పోటీలను నిర్వహించారు. ఈ గుర్రపు పందాలను తిలకించేందుకు రాష్ట్ర నలమూల నుంచి వచ్చిన ప్రజలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసి పోయింది. అనంతరం గెలుపొందిన 10మంది విజేతలకు నగదు, ట్రోఫీలను కమిటీ సభ్యులు అందజేశారు.