ఎస్ఐ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేదని, ఆన్లైన్ లో సొమ్ము పంపించాలని కొందరు ఫోన్ చేసి అడుగుతున్నారని, ఇలాంటి ఫోన్లు వస్తే వెంటనే పోలీసులకు తెలపాలని గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ కోరారు. కొందరు సైబర్ నేరగాళ్లు ఇలా మోసానికి పాల్పడుతున్నట్లు తమదృష్టికి వచ్చిందని ఆయన సోమవారం మీడియాకు తెలిపారు. బాధితుల తరఫున సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఎవరికైనా ఇలాంటి ఫోన్లు వస్తే సమాచారం తెలపాలని ప్రజలను కోరారు.