గొల్లప్రోలు మండలం చెందుర్తిలో వెయ్యి కేజీల పశు మాంసాన్ని స్వాధీనం ఆదివారం స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. చెందుర్తి గ్రామంలో పశువధ జరుగుతుందన్న సమాచారంతో సిబ్బందితో దాడులు చేపట్టామన్నారు. పశు మాంసాన్ని స్వాధీనం చేసుకుని, పూడ్చి పెట్టినట్లు తెలిపారు. ఒక ఆటో, నాలుగు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని, నలుగురిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేశారు.