గొల్లప్రోలు: గంట వ్యవధిలో తల్లిదండ్రుల చెంతకు మూడేళ్ల బాలుడు

53చూసినవారు
గొల్లప్రోలు: గంట వ్యవధిలో తల్లిదండ్రుల చెంతకు మూడేళ్ల బాలుడు
గొల్లప్రోలు పట్టణంలోని ఈబీసీ కాలనీకి చెందిన మూడేళ్ల బాలుడు పప్పిరెడ్డి శ్రీహాన్ మంగళవారం ఉదయం కనబడకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంట వ్యవధిలోనే జాతీయ రహదారి 216 పక్కన ఉన్న ఒక హోటల్ వద్ద బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్