కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా కొడవలి గ్రామ శివారులో నిర్వహించిన దాడిలో అక్రమ ఓడు గెలుపు జూదం జరుపుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 4,450 నగదు స్వాధీనం చేసుకొని, సంబంధిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు.