తాగునీటి పైపులైన్లకు లీకేజీలు ఏర్పడటంతోపాటు నీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. తాటిపర్తిలోని బోర్ల ద్వారా గొల్లప్రోలులోని రక్షిత తాగునీటి పథకానికి నీరు సరఫరా అవుతుంది. గత నెలరోజుల క్రితమే లీకేజీలకు మరమ్మతులు నిర్వహించడంతోపాటు పలుచోట్ల కొత్త పైపులైను ఏర్పాటు చేశారు. రోజుల వ్యవధిలోనే పైపులైనుకు లీకులు ఏర్పడి నీరు వృథాగా పోతోంది. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.