గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో అధికారులు శునకాల సంతతి నియంత్రణ చర్యలు చేపట్టారు. పట్టణంలో కుక్కలు అధికంగా ఉన్నాయని పలుమార్లు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు నగర పంచాయతీ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలో 30 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి గొల్లప్రోలులో వదిలారు. మరో 20 కుక్కలను మంగళవారం తీసుకుని వెళ్లారు. కుక్కల సంతతి నియంత్రణ చర్యలు చేపడుతున్నామని కమిషనర్ కనకరాజు మీడియాకు తెలియజేశారు.