జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు గురువారం గొల్లప్రోలు పట్టణంలో స్రవంతి ఆగ్రోస్ దుకాణంలో పురుగుమందులు ఎరువులు, విత్తనాలు తనిఖీ చేశారు. దుకాణం నందు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులు వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దీనిపై లైసెన్సు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి కేవివి సత్యనారాయణ, పిఠాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు పి. స్వాతి, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.