గురుపౌర్ణమి పర్వదినాలు సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వేట్లపాలెం, అచ్చంపేట సాయిబాబా ఆలయాలలో జరిగిన విశేష పూజలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చినరాజప్ప, అనూరాధ దంపతుల తో బాటు కుమార్తె, మనుమలు కూడా ఈ పూజలలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధి గుమ్మళ్ళ సత్యనారాయణ చే ఎమ్మెల్యే చినరాజప్ప దంపతులను శాలువాలు కప్పి, పూలమాలాలతో సత్కరించి వేదశ్వస్తి పలికి ప్రసాదాలు అందజేశారు.