గర్భశోకం కలిగించింది జగనే: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

అమ్మఒడి పేరుతో తల్లులకు గర్భశోకం కలిగించిన వ్యక్తి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డే అని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరో పించారు. శనివారం పిఠాపురంలో తల్లికి వందనం నగదు విడుదలపై సంబరాలు నిర్వహించారు. పథకం అందుకున్న ముగ్గురు, ఇద్దరు పిల్లలు కలిగిన తల్లిదండ్రులు మాట్లాడారు. అనంతరం పిఠాపురం పట్టణానికి చెందిన ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.