2024 జూన్ 12.. ఉదయం 11.27 గంటలు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసి... వైసీపీ అస్తవ్యస్తం, అంధకారం చేసిన రాష్ట్రంలో తన అనుభవంతో వెలుగులు నింపడానికి అధి కార పగ్గాలు చేపట్టిన ఘడియలు. రాష్ట్రంలో నవశకం..జనం కళ్లలో ఆనందం పునః ప్రారం భమైన రోజు.. చెడు తాత్కాలికంగా విర్ర వీగవచ్చు గానీ అంతిమంగా మంచిదే పైచేయి అని మరోసారి చరిత్రలో నిలిచిన సాక్ష్యం. ఐదేళ్ల నరకం నుంచి రాష్ట్రం బయటపడే దిశగా ‘చం ద్రూదయాని’కి అంకురార్పణ మన ‘తూర్పు’లోనే జరగడం ఉమ్మడి తూర్పు ప్రజ లకు గర్వకారణం. దుష్టపాలనను అంత మొం దించడానికి పడిన ప్రతి అడుగునకు రాజమ హేంద్రవరం వేదికైంది. రాష్ట్ర చరిత్రను తిరగరా సిన అదృష్టం గోదావరి తీరం కీర్తి సిగలో మరో కలికితురాయిగా చేరింది.పడి లేచిన ‘చంద్రా’నికి.. తోడున్న ‘పవనా’నికి ఊతమై నిలిచింది