తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజినోవ భారీ విరాళం అందించారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పేర మీద రూ.17 లక్షల విరాళాన్ని సమర్పించిన ఆమె, ఈరోజు అదే పేరుతో భక్తులకు మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. కాగా, నేడు తిరుమల శ్రీవారిని అన్నా కొణిదల దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందుకున్నారు.