డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తాటిపర్తి హైస్కూల్ విద్యార్థుల సమస్య పరిష్కారమైంది. ఈ పాఠశాలలో చదువుతున్న తాటిపర్తి, కొడవలి, వన్నెపూడి గ్రామాల టెన్త్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాసేందుకు 15 కి. మీల దూరంలో ఉన్న గొల్లప్రోలు వెళ్లాల్సి వస్తోంది. దీంతో మండుటెండలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గతంలో పర్యటనకు వచ్చిన పవన్ కు విన్నవించారు. దీంతో ఆయన తాటిపర్తిలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయించారు.