పిఠాపురం: 60 కేజీల పశుమాంసంతో ఆటో స్వాధీనం

73చూసినవారు
పిఠాపురం: 60 కేజీల పశుమాంసంతో ఆటో స్వాధీనం
గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామ శివారుణ అక్రమ కబేళా నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం రాత్రి గొల్లప్రోలు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమ రవాణా తరలిస్తున్నటువంటి ఆటోను, 60 కేజీల పశు మాంసమును స్వాధీనం చేసుకున్నారు. చెందుర్తి గ్రామానికి చెందిన కాకాడ వీరబాబు, కాకాడ రాజేష్ లను అదుపులోనికి తీసుకుని, వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్