పిఠాపురం పట్టణ శివారు జగ్గయ్య చెరువు ప్రాంతంలో బుధవారం అగ్ని ప్రమాద వారోత్సవాల్లో భాగంగా ఆ ప్రాంత ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ లీక్ అయినప్పుడు మంటలు వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై మహిళలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఈ సందర్భంగా వారికి సూచించారు.