పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ జన్మదిన వేడుకలు పిఠాపురం పట్టణంలో టీడీపీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా, పలువురు రక్తదానం చేశారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి స్ఫూర్తి ప్రదాతగా వర్మ నిలిచారని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.