చిత్తూరులో భూముల్ని ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పెద్దిరెడ్డిని అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. దాంతో పెద్దిరెడ్డిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దిరెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందని సమాచారం.