పిఠాపురం: పవన్ పర్యటనలో.. మహిళా నేతకు గాయం

66చూసినవారు
పిఠాపురం: పవన్ పర్యటనలో.. మహిళా నేతకు గాయం
పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో జనసేన పార్టీ మహిళా నేత చల్లా లక్ష్మికి గాయమైంది.  సంక్రాంతి సంబరాలకు వెళ్లేందుకు ఆమె అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చల్లా లక్ష్మీ తలకు గాయమైంది. పోలీసుల వైఖరిపై జనసేన వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్