పిఠాపురం: శాస్త్రీయ దృక్పథం పెంపుదలకు కృషి: జెవివి

6చూసినవారు
పిఠాపురం: శాస్త్రీయ దృక్పథం పెంపుదలకు కృషి: జెవివి
ప్రస్తుత తరుణంలో శాస్త్రీయ దృక్పథాన్ని మరింతగా పెంపుదల చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని జెవివి రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యులు, జిల్లా చెకుముకి కన్వీనర్‌ వర్మ ఆన్నారు. ఆదివారం స్థానిక లైన్స్‌ క్లబ్‌ కల్యాణ మండపంలో జన విజ్ఞాన వేదిక మండల మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతుంటే, మరోపక్క మూఢనమ్మకాలు ప్రభావానికి ప్రజలు గురువ్వుతున్నారన్నారు. జెవివిగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో కృషి చేస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్