పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ యు. కొత్తపల్లి మండలం కొమరగిరి, గోర్స రైతులను మంగళవారం సందర్శించి రైతుల నుంచి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అధికారులెవరూ రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని తెలియజేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని, కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల సిబ్బంది సహకరించడం లేదని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.