రాజీ మార్గమే రాజ మార్గం అంటూ ఇరు వర్గాల వారికి అవగాహన కల్పిస్తూ లోకదాలత్ ద్వారా పెండింగ్ కేసులు పరిష్కరించుకోవచ్చని పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జి ఎం. శ్రీహరి అన్నారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పిఠాపురంలోని మూడు కోర్టుల పరిధిలో 340 కేసులు రాగా 175 కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా జడ్జి శ్రీహరి తెలిపారు.