పిఠాపురం: సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక

81చూసినవారు
పిఠాపురం: సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు పీడీ చైత్ర వర్షిని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్