పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశం కోసం హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన సచివాలయానికి వచ్చారు. అయితే.. అనారోగ్య కారణంతో ఆయన తిరిగి వెళ్లిపోయినట్లు జనసేన నేతలు వెల్లడించారు. కాగా, గత కొంతకాలంగా పవన్ తరచూ అనారోగ్యానికి గురవుతున్న విషయం తెలిసిందే.