నీతి, నిజాయితీతో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు పని చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. శుక్రవారం ఆయన పిఠాపురంలో మాట్లాడారు. ఉపముఖ్య మంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలు తన ఆలోచనలు ఒకటేనని స్పష్టం చేశారు. నీతి నిజాయితీగా పనిచేస్తే పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని వర్మ ధీమా వ్యక్తం చేశారు.