పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పిఠాపురం ఇన్ ఛార్జ్ వంగా గీత పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల వారి కోసం పూలే చేసిన సేవలు మరువలేనివని అప్పటి పరిస్థితుల్లో వెనుకబడిన వర్గాలను ముందుండి నడిపించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని తెలిపారు.