పిండినల్లి ఆశించిన పత్తి పంటపై సస్య రక్షణ చర్యలు చేపట్టడంతో తెగులు అదుపులోకి వచ్చినట్లు గుర్తించామని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. దుర్గాడలో పిండినల్లి సోకిన పత్తి పంటను బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రొఫినోపాస్ మూడు మిల్లీ లీటర్లుగాని, ఎసిఫేట్ 2 గ్రాములు చొప్పున లీటరు నీటికి కలిపి ద్రావణాన్ని పిచికారీ చేయగా తెగులు అదుపులోకి వచ్చినట్లు గుర్తించారన్నారు.