కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం కొత్తమూలపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసు సిబ్బంది చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. గ్రామంలో ఓ ప్రాంతంలో ఉన్న 20 లీటర్ల నాటుసారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మూడు మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు.