తుని పట్టణం ఎన్హెచ్ వద్ద తుప్పల్లో గుర్తించిన మృతదేహం పిఠాపురం కోలంక గ్రామానికి చెందిన నంద్యాల వీరభద్రరావు(40)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆయన ఈనెల 9 నుంచి కనిపించకుండా పోయారు. తల వెనుక గాయం కనిపించిందని, ఆత్మహత్యా కోణం లేదని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తుని ఆసుపత్రికి తరలించారు. ఈయన చీటీల వ్యాపారం చేస్తారు. వీరి అదృశ్యంపై పిఠాపురంలో కేసు నమోదైంది.