రైతాంగం వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి, ఆరుకాలాలుపాటు కష్టించి పండించిన పంటకు కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా, సాకులు చెప్తూ ఈ కూటమి ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. ఆదివారం గొల్లప్రోలు మండలంలో పార్టీ నాయకులతో కలిసి చేబ్రోలు గ్రామంలో ఆమె పంటపొలాలను పర్యటించారు. కొనుగోళ్లు లేక కల్లాల్లోనే ఉండిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు.