పిఠాపురం సీఐ శ్రీనివాస్ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఉప్పాడ బస్టాండ్ నుంచి మార్కెట్ వరకు దుకాణదారులు, వాహనదారులకు శనివారం అవగాహన కల్పించారు. వాహనాలు పార్కింగ్ ప్రాంతాల్లోనే పెట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.