ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటించాలని సిఐ శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం పాదగయ క్షేత్రం వద్ద ద్విచక్ర వాహనదారులకు మంగళవారం రాత్రి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ వాహనానికి సంబంధించిన పేపర్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.