ఏప్రిల్ 14న సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ జన్మదినము సందర్బంగా ప్రభుత్వ కార్యాలయములకు సెలవు అయినందున, ఆరోజున పిఠాపురం పట్టణంలో పాడా కార్యాలయం నందు జరగబోయే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు పాడా పీడీ ఏ. చైత్రవర్షిణి శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. కావున అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.