రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ భద్రతపై సోమవారం డీజీపీ స్పందించారు. ఆయన ఇంటిపై డ్రోన్ ఎగిరిందా లేదా అనే క్లారిటీ లేదని 24 గంటల్లో పూర్తి సమాచారం మీడియాకు అందిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ టూర్ ముగిసిన తర్వాత ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్ వేసుకుని తిరిగాడన్నారు. డిప్యూటీ సీఎం భద్రతపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామన్నారు. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తమ దృష్టికి రాలేదన్నారు.