సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని పిఠాపురం అండర్ పాస్ వంతెన సమీపంలో మంగళవారం ఉదయం సుమారు 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు రైలు పట్టాలపై రైలు కింద తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన గురించి సమాచారం అందుకున్న సామర్లకోట రైల్వే పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతని మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు.