గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య వారోత్సవాలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు కమిషనర్ రవికుమార్ తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచే కార్యక్రమాలు సచివాలయాలు, వార్డులవారీగా నిర్వహిస్తామన్నారు. వీధులను శుభ్రపరిచి చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించడం, డ్రెయిన్లులో పూడిక తీసి తరలించడంతో పాటు బ్లీచింగ్ చల్లి, దోమల నిర్మూలనకు మందులు పిచికారిచేసే పనులు చేపడతామన్నారు.