ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు సెక్యూరిటీ పెంచాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కోరారు. ఆదివారం ఆయన టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర నిఘా సంస్థలు సైతం పవన్ కల్యాణ్ కు ప్రాణహాని ఉందని సమాచారం ఇచ్చాయన్నారు. ఈ మేరకు ఆయన భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.