గొల్లప్రోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా డీఎల్ఎస్ శర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరుకు బదిలీపై వెళ్లిన శర్మ తిరిగి ఇక్కడికి వచ్చారు. ఇక్కడి ఎంపీడీవో ఎ. జయప్రకాశరావు విశాఖ జిల్లాకు బదిలీ అయ్యారు. ఎంపీడీవో శర్మను ఈవోపీఆర్డీ కుమార్, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది కలిసి అభినందించారు.