త్రాగునీటి సమస్యకు పరిష్కార మార్గం చూపండి

69చూసినవారు
త్రాగునీటి సమస్యకు పరిష్కార మార్గం చూపండి
గొల్లప్రోలు పట్టణ ప్రజలు త్రాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్న తీరుపై బుధవారం జనసైనికులు కాకినాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహమ్మద్ హుస్సేన్ కు వివరించడం జరిగింది. గత నెల రోజులుగా గొల్లప్రోలు పట్టణంలో కుళాయిల ద్వారా అందించే నీరు బురదమయంగా మారిందని, దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని తెలిపారు.

సంబంధిత పోస్ట్