దుర్గాడలో వేగుళ్లమ్మకు ప్రత్యేక పూజలు

82చూసినవారు
దుర్గాడలో వేగుళ్లమ్మకు ప్రత్యేక పూజలు
గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామదేవతగా విరాజిల్లుతున్న వేగుళ్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం సౌభాగ్య స్త్రీలచే లలితా సహస్రనామ కుంకుమార్చనలు జరిగాయి. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తులు పూజాది కార్యక్రమాలు నిర్వహించగా, ఆలయ సేవాసమితి సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్