చెరువులో పడి యువకుడు గల్లంతు

1118చూసినవారు
కాకినాడ రూరల్ మండలం వలస పాకల గ్రామానికి చెందిన అప్పన్న అనే 25 ఏళ్ల యువకుడు శనివారం చెరువులో పడి గల్లంతయ్యాడు. కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో త్రాగునీరు ట్యాంకులు శుభ్రపరిచేందుకు వెళ్లిన అప్పన్న శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం వాక తిప్ప శివారు చెరువుగట్టుపై వెళ్తూ ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి గల్లంతయ్యాడు. అప్పన్న ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్