కబేళాల నిర్వహణ పై నిరంతర నిఘా ఉంటుంది

71చూసినవారు
కబేళాల నిర్వహణ పై నిరంతర నిఘా ఉంటుంది
అక్రమ కబేళాల నిర్వహణపై నిరంతర నిఘా ఉంటుందని కాకినాడ ఆర్డీవో కిషోర్ హెచ్చరించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కబేళా నిర్వాహకులు, రెవెన్యూ, పంచాయతీ, పశు సంవర్ధక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ పశురవాణా, మాంసం విక్రయాలు, కబేళా నిర్వహిస్తున్న ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయన్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతూ చర్యలు చేపడుతున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్