హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అంటూ కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ వద్ద పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు వినూత్నంగా ప్రచారం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో బీచ్ ప్రాంతంలో పోలీసులు బైక్ ర్యాలీ చేపట్టి, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందన్నారు.