ఏపీ హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం అన్నవరం సత్యదేవుని సన్నిధికి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల వ్రతం ఆచరించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యంత్రాలయం దర్శనం అనంతరం వేద పండితులు జడ్జి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనములు అందించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.