అన్నవరం అనంత లక్ష్మీ అమ్మవారికి వజ్రాల హారం విరాళం

0చూసినవారు
అన్నవరం అనంత లక్ష్మీ అమ్మవారికి వజ్రాల హారం విరాళం
అన్నవరం ఆలయంలో అనంత లక్ష్మీ అమ్మవారికి పెద్దాపురం శ్రి లలిత ఎంటర్‌ప్రైజెస్ ఎండీ మట్టే సత్యప్రసాద్–సూర్యకమల దంపతులు ఆదివారం రూ.20 లక్షల విలువైన వజ్రాల హారాన్ని బహూకరించారు. ఇది 122 గ్రాముల బంగారం, వజ్రాలతో తయారు చేశారు. ఈవో సుబ్బారావు ద్వారా ఆలయానికి అందించగా, అమ్మవారికి వైదిక పూజలతో అలంకరించారు. అలాగే వజ్ర కిరీటం, కర్ణాభరణాలు కూడా సమర్పించారు.

సంబంధిత పోస్ట్