ఏలేశ్వరం ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా జె. శ్రీనివాస్

64చూసినవారు
ఏలేశ్వరం ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా జె. శ్రీనివాస్
ఏలేశ్వరం మండల ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా జె. శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రత్తిపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ బదిలీపై ఏలేశ్వరం వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మండలాధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you