శంఖవరంలో రూ. 3. 77 లక్షలు నగదు సీజ్

66చూసినవారు
శంఖవరంలో రూ. 3. 77 లక్షలు నగదు సీజ్
శంఖవరం మండలం కత్తిపూడిలో బుధవారం ఆనంద్ కుమార్ అనే అధికారి ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ సమీపంలో ఒక వ్యక్తి వద్ద నుంచి రూ. 3. 77 లక్షలు నగదును గుర్తించి సీజ్ చేశారు. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో కాకినాడ ట్రెజరీకి జమ చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్