శంఖవరం మండలం సీతంపేట గ్రామంలో ఉన్న దుర్గా మీనాక్షి అమ్మవారి దసరా మహోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం దసరా ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త తులసి గుర్రప్ప, అనందరావు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు